SIIMA 2024 | దక్షిణాది సినీ పరిశ్రమలో అందించే ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటి సైమా (Siima). పాపులర్ అవార్డు సెర్మనీల్లో ఒకటైన సైమా 2024లో తెలుగు, తమిళ చిత్రాలు తమ హవా చాటుతున్నాయి. ఈ పురస్కారాలకు పోటీపడుతున్న సినిమాల జాబితాను సైమా టీం విడుదల చేసింది. 2023కుగాను తెలుగులో నాని నటించిన దసరా అత్యధికంగా 11 విభాగాల్లో నామినేట్ కాగా.. తమిళసూపర్ స్టార్ నటించిన జైలర్ (తమిళం)కూడా 11 విభాగాల్లో నామినేట్ అయి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
జైలర్.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ కమెడియన్తోపాటు మరో ఎనిమిది విభాగాల్లో నామినేట్ అయింది. ఇక మలయాళం నుంచి టోవినో థామస్ నటించిన 2018, కన్నడ నుంచి దర్శన్ నటించిన కాటేరా 8 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. దుబాయ్లో సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో (NEXA Siima) సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనుంది.
SIIMA the Biggest Awards in South India which is consistently honoring the best of South Indian Cinema over the last 12 years is hosting #SIIMA2024 in Dubai on 14th and 15th September.#NEXASiima Nominations Announced.
Dasara, Jailer, Kaatera and 2018 are leading in Telugu,… pic.twitter.com/cwjKG3VllX— Sreedhar Pillai (@sri50) July 16, 2024
Sardar 2 | మిషన్ కంబోడియా టైం.. కార్తీ సర్దార్ 2లో స్టార్ యాక్టర్
Kanguva | సూర్య కంగువ సాంగ్లో ఎంతమంది ఆర్టిస్టులుండబోతున్నారో తెలుసా..?
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్