Sardar 2 | కోలీవుడ్ నటుడు కార్తీ (Karthi) టైటిల్ రోల్లో నటిస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ సర్దార్ 2 (Sardar 2). మిషన్ కంబోడియా నేపథ్యంలో సాగే సర్దార్ 2 పూజా కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరుగగా.. రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. స్టంట్ మ్యాన్ ఎజుమలై కీలక యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సమయంలో 20 అడుగుల ఎత్తుపై నుంచి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారమందుకున్న విరుగంబాక్కమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. స్టంట్ చేస్తున్న సమయంలో భద్రతా పరికరాలు ఉపయోగించనట్టుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఊహించని ఈ ప్రమాదంతో సినిమా షూటింగ్‌ను అర్దాంతరంగా నిలిపేశారు.
ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. సర్దార్ 2ను కథానుగుణంగా కజకిస్తాన్, అజర్బైజాన్, జార్జియాలో చిత్రీకరించేలా ప్లాన్ చేయగా.. తాజా ప్రమాదంతో సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Sowcar Janaki | షావుకారు జానకికి ఆ సమయంలో పూట గడవని పరిస్థితి ఎందుకు వచ్చింది?
SIIMA 2024 | సైమా 2024లో దసరా, జైలర్ హవా.. ఎన్ని కేటగిరీల్లో నామినేట్ అయ్యాయంటే..?
మిషన్ కంబోడియా…
#Sardar 💥
Once a spy, always a spy!
Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp— Prince Pictures (@Prince_Pictures) October 25, 2022