Pushpa 2 The Rule | టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాంఛైజీ ప్రాజెక్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషిస్తుండగా.. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప ది రూల్ వాయిదా వేస్తూ.. 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు తెలియజేశారు మేకర్స్.
ఇదిలా ఉంటే సుకుమార్ హాలీడే ట్రిప్‌లో భాగంగా యూఎస్ఏకు వెళ్లాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి పుష్ప ది రూల్ షూటింగ్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కోసం క్రేజీ వార్త బయటకు వచ్చింది. సుకుమార్ ట్రిప్ ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చేశాడట. అంతేకాదు యూరప్ ట్రిప్‌లో ఉన్న బన్నీ కూడా మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వస్తాడని అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా టాక్ ప్రకారం వచ్చే వారం పుష్ప ది రూల్ నయా షెడ్యూల్ షురూ కానుండగా.. సెప్టెంబర్ చివరికల్లా షూట్ పూర్తికానుందని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే పుష్ప 2 వార్తల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్తే అని చెప్పాలి.
మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కొత్త పోస్టర్లో బన్నీ పుష్పరాజ్‌గా కత్తి పట్టుకుని ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మరోసారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తు్ండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
ఇప్పటికే మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన పుష్ప పుష్ప, సూసేకి సాంగ్స్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదలై నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. పుష్ప ది రూల్‌లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Sardar 2 | కార్తీ సర్దార్ 2 షూట్లో స్టంట్‌మ్యాన్ మృతి.. కారణమిదే..!
SIIMA 2024 | సైమా 2024లో దసరా, జైలర్ హవా.. ఎన్ని కేటగిరీల్లో నామినేట్ అయ్యాయంటే..?