Music Shop Murthy | అజయ్ ఘోష్ (Ajay ghosh) టైటిల్ రోల్లో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి (Chandini Chowdary), ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తనదైన మ్యానరిజంతో ఎంటర్టైన్ చేసిన అజయ్ ఘోష్ టైటిల్ రోల్లో జీవించేశాడని ఇప్పటివరకు వచ్చిన టాక్ క్లారిటీ ఇచ్చేసింది.
థియేటర్లలో మిస్సయిన వారి కోసం ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం ఈటీవీ విన్లోకి వచ్చేసింది. అంతేకాదు ఈ చిత్రం మరింత ఎక్కువమందికి చేరువయ్యేలా మరో పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం రెండు ప్లాట్‌ఫాంలలో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతూ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కావాల్సిన వినోదాన్ని అందిస్తోందని ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇంకేంటి మరి మ్యూజిక్ షాప్ మూర్తి సందడి ఎలా ఉందో తెలుసుకోవాలంటే సినిమాపై మీరూ ఓ లుక్కేయండి
ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్షగారపాటి, రంగారావు గారపాటి తెరకెక్కించిన ఈ చిత్రం టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. కుటుంబ భావోద్వేగాలు, కామెడీతోపాటు మంచి సందేశాన్ని ఇచ్చే కథాంశంతో సాగుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ బెజుగం కెమెరామెన్ కాగా.. పవన్ సంగీతం అందిస్తున్నాడు.
The critically acclaimed feel-good family entertainer #MusicShopMurthy is now streaming on @PrimeVideoIN
The response from the OTT audience is quite encouraging. Enjoy this wholesome entertainer with your familyhttps://t.co/HCytJwdgDA#AjayGhosh @ichandinic@actoramitsharma… pic.twitter.com/HLuB6Jj0YR
— Ramesh Bala (@rameshlaus) July 17, 2024
35 Chinna Katha Kaadu | సంప్రదాయ చీరకట్టులో నివేదా థామస్.. 35 చిన్న కథ కాదు సరస్వతి గ్లింప్స్
Amaran | శివకార్తికేయన్ థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్.. అమరన్ రిలీజ్ లుక్ వైరల్
R Narayana Murthy | సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తికి అస్వస్థత
Pushpa 2 The Rule | ట్రిప్‌లో అల్లు అర్జున్-సుకుమార్.. మరి పుష్ప ది రూల్ షూటింగ్ ఎప్పుడంటే..?
Sardar 2 | కార్తీ సర్దార్ 2 షూట్లో స్టంట్‌మ్యాన్ మృతి.. కారణమిదే..!