35 Chinna Katha Kaadu | కేరళకుట్టి నివేదా థామస్ (Nivetha Thomas) ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 35- చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu). నందకిశోర్ (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియదర్శి, విశ్వదేవ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ సరస్వతి పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ సరస్వతి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ షేర్ చేశారు.
నివేదా థామస్ సంప్రదాయక చీరకట్టులో తెలుగుదనం ఉట్టిపడే గృహిణిగా కనిపంచబోతున్నట్టు గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. విలువే లేని సున్నా పక్కన ఒకటి వేస్తే పది.. 9 కన్నా పెద్దదని ఎట్లా చెప్తరు.. అంటూ నివేదా థామస్ అడిగే చిలిపి ప్రశ్నతో షురూ అయిన టీజర్‌తో సినిమా ఫన్నీ ఎలిమెంట్స్‌తో సరదాగా సాగనున్నట్టు తెలియజేశాడు. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్రామంలోని చిన్న కుటుంబం చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా సాగనుంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో చివరగా శాకిని డాకిని సినిమాలో నటించింది నివేదా థామస్. లాంగ్ గ్యాప్ తర్వాత అచ్చ తెలుగు అమ్మాయిగా అలరించేందుకు రెడీ అవుతోంది.
సరస్వతి గ్లింప్స్ ..
Here’s a 35 seconds beautiful glimpse of “Saraswathi” aka @i_nivethathomas from #35Movie pic.twitter.com/2MydhSoSqe
— Filmy Tollywood (@FilmyTwood) July 17, 2024
మా సరస్వతి..
ఇప్పట్నుంచి మీ S.P.V.P.K.K.P.M.B. ‘సరస్వతి’ 🤩❤️Here’s a 35 seconds beautiful glimpse of “SARASWATHI” aka @i_nivethathomas from #35Movie 😍
In cinemas from AUGUST 15th, 2024💥@PriyadarshiPN @imvishwadev @gautamitads @RanaDaggubati… pic.twitter.com/2chqHrTuDT
— Suresh Productions (@SureshProdns) July 17, 2024
Amaran | శివకార్తికేయన్ థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్.. అమరన్ రిలీజ్ లుక్ వైరల్
R Narayana Murthy | సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తికి అస్వస్థత
Pushpa 2 The Rule | ట్రిప్‌లో అల్లు అర్జున్-సుకుమార్.. మరి పుష్ప ది రూల్ షూటింగ్ ఎప్పుడంటే..?
Sardar 2 | కార్తీ సర్దార్ 2 షూట్లో స్టంట్‌మ్యాన్ మృతి.. కారణమిదే..!