Shiva Balaji | ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే కొన్ని సార్లు చేసే అనవసరమైన ట్రోల్స్ నటీనటులను ఇబ్బంది పెడుతుంటాయి. ఈ విషయమై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ డీజీపీ జితేందర్‌ను కలిశారు. సోషల్ మీడియాలో నటీనటులపై వచ్చే ట్రోల్స్‌పై వారు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ట్రోల్స్ వల్ల లేడీ ఆర్టిస్టులు ఇబ్బందులు పడుతున్నారని నటుడు శివకృష్ణ అన్నారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా పోరాటం చేస్తున్నారని నటుడు శివబాలాజీ (Shiva Balaji) తెలిపాడు. 200 యూట్యూబ్ ఛానళ్లపై పిర్యాదు చేశాం. 25 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించేలా చేశాం. సైబర్ సెక్యూరిటీ వింగ్ దీనిపై దృష్టి సారించింది. ట్రోల్స్ చేసే వారిని తీవ్రవాదులుగా పరిగణిస్తాం. డీజీపీ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నాడు.. నటీనటులపై ట్రోల్స్ చేస్తే సహించేది లేదని రాజీవ్ కనకాల హెచ్చరించాడు.
Music Shop Murthy | ఓటీటీలో ఇంప్రెసివ్‌గా అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి
Sai Pallavi | సాయిపల్లవికి తండేల్ టీం శుభాకాంక్షలు.. స్టిల్స్ వైరల్