Double iSmart | టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తు్న్నాడు. ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తోంది. కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది పూరీ టీం. తాజా టాక్ ప్రకారం బాలీవుడ్లో డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్‌కు రెడీ అవుతున్నారని, ముంబైలో ఓ భారీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతుండగా చిత్రయూనిట్ ఇందులో పాల్గొనబోతుందని బీటౌన్ సర్కిల్ టాక్. ఇస్మార్ట్ శంకర్‌కు స్పీకర్ అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి వర్క్ చేస్తుండటం అంచనాలు భారీగానే ఉన్నాయి. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు.
పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. మాస్ మ్యూజిక్ జాతరలో భాగంగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన STEPPAMAAR, మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ సాంగ్స్‌కు నెట్టింట మంచి స్పందన వస్తోంది.
Krishna Vamsi | రాంచరణ్ రెడీ అయితే నేనూ కూడా రెడీ సార్.. కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్
Dhanush | నిప్పులాంటి నిరుద్యోగి.. ధనుష్ ల్యాండ్ మార్క్ సినిమా వీఐపీకి పదేళ్లు..
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ