Lokesh Kanagaraj | దశాబ్దాలుగా తన యాక్టింగ్‌తో కోట్లాది మందిని అలరిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ఇక రాజకీయాలపై ఫోకస్ పెట్టబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్న దళపతి 69తో ఫుల్ బిజీగా ఉన్నాడు విజయ్. పొలిటికల్ జర్నీ నేపథ్యంలో ఇదే చివరి సినిమా కానుందని తెలిసిందే. తాజాగా ఇదే విషయమై డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
విజయ్ సార్ రిటైర్మెంట్తో యావత్ తమిళనాడు షాక్‌లో ఉండిపోయింది. కానీ ఆయన నిర్ణయాన్ని మనమంతా తప్పకుండా గౌరవించాలి. విజయ్ ఒకవేళ ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే.. ఆయనతో నేను లియో 2 చేయాల్సి ఉండేది. అలా అయితే లియో 2 కానీ విక్రమ్ 2 కానీ ఎల్సీయూ గ్రాండ్ ఫినాలే అయి ఉండేదని చెప్పుకొచ్చాడు లోకేశ్ కనగరాజ్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్‌తో కూలీ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు కార్తీతో బ్లాక్ బస్టర్ ఖైదీకి సీక్వెల్‌గా రాబోతున్న ఖైదీ 2 కూడా చేయబోతున్నాడు. కూలీ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఖైదీ 2 2025 ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుంది.
లోకేశ్ కనగరాజ్ చిట్‌చాట్..
“The entire Tamil Nadu is in shock over @actorvijay sir’s retirement 😭, but we must respect his decision. If not, I might have worked on #Leo2 with him. Perhaps Leo 2 or Vikram 2 could have been the grand finale of the LCU” 🔥🤯 – @Dir_Lokesh pic.twitter.com/mDpI6DMa8T
— Arun Vijay (@AVinthehousee) November 4, 2024
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Nikhil Siddhartha | ప్రతీ పది నిమిషాలకో ట్విస్ట్.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాపై నిఖిల్
Thandel | డైలామాకు చెక్.. ఆ టైంలోనే నాగచైతన్య తండేల్ రిలీజ్..!