Venky Kudumula | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీల (Sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా వెంకీ కుడుముల రష్మిక స్థానంలో శ్రీలీలను తీసుకోవడం గురించి మాట్లాడుతూ.. రష్మిక మందన్నా మా సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు ఆమె చేతిలో అప్పటికే రెండు హిందీ ప్రాజెక్ట్‌లు, పుష్ప 2 ఉన్నాయి. ఆమె డేట్స్‌కు అనుగుణంగా చిన్న షెడ్యూల్‌లను ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఈ షెడ్యూల్ చేయడం సాధ్యం కాదని భావించి ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నాడు. అంతేకాదు ఈ సినిమాలో రష్మిక స్పెషల్ అప్పియరెన్స్ ఉంటుందన్న వార్తలపై స్పందిస్తూ.. సినిమాలో అలాంటి ఆస్కారం లేదని, రష్మిక ఈ సినిమాలో ఉండరని క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పటిదాకా చేసిన సినిమాల కంటే నాకు రాబిన్ హుడ్ సినిమా స్క్రిప్ట్ వర్క్‌కు చాలా మంచి సమయం దొరికింది. ఇప్పటివరకు నేను తీసిన సినిమాల్లో ఇదే బెస్ట్ సినిమా. క్రిస్మస్ హాలీడేస్‌లో సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉండాలనే ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకంగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. ఖచ్చితంగా ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందన్నాడు వెంకీ కుడుముల.
ఈ చిత్రంలో నటకిరిటీ రాజేంద్రప్రసాద్ ఏజెంట్ జాన్ స్నోగా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్ కీ రోల్లో నటిస్తున్నాడు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మి్స్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Suriya 45 | సూర్య 45 పూజా సెర్మనీ టైం.. షూటింగ్ మొదలయ్యేది ఇక్కడే..!
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు