Vivek Athreya | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) ఇటీవలే సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో అందరినీ పలుకరించాడని తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించగా.. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించాడు. ఆగస్టు 29న విడుదల కాగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో సందడి చేస్తోంది.
సక్సెస్ఫుల్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈవెంట్లో వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. తన రచనలో తప్పులు ఉన్నాయని ఒప్పుకున్నాడు. ఈ సినిమా రైటింగ్ కొన్ని తప్పులు జరిగాయని నిస్సంకోచంగా చెబుతున్నా. ఓ రైటర్‌గా నాకు ఈ విషయం తెలుసు. అయితే అద్భుతమైన యాక్టర్లు సినిమాలో ఉండటం వల్ల తన రైటింగ్‌లో ఉన్న తప్పులు కనిపించలేదన్నాడు.
రైటింగ్ విషయంలో తాను తప్పులు చేశానని, గొప్ప ఆర్టిస్టులను సినిమాకు ఎంపిక చేసుకోవడం వల్లే.. వారి అద్భుతమైన యాక్టింగ్‌తో సినిమా కవర్ అయిందని చెప్పుకొచ్చాడు. నా తప్పులు అందుకే కనిపించలేదంటూ చెప్పుకొచ్చాడు వివేక్ ఆత్రేయ. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
Dil Raju | థంపింగ్ రెస్పాన్స్.. గేమ్ ఛేంజర్‌లో ఎస్జే సూర్య పాత్రపై దిల్ రాజు
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, తారక్ ఫ్యామిలీ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో..!
Telugu Film Chamber | వరద బాధితుల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ భారీ విరాళం.. వివరాలివే