Nayan Sarika | టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తో్న్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ క (KA). సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో 2018 ఫేం తాన్వి రామ్, గం గం గణేశా ఫేం నయన్ సారిక ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేసింది నయన్ సారిక.
క విశేషాల గురించి నయన్ సారిక మాట్లాడుతూ.. సినిమాకు యూనివర్సల్ థీమ్ ఉంది. అందుకే కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ కథ ప్రతి ఒక్కరికీ దగ్గరగా ఉంటుంది. ఈ చిత్రంలో సాంస్కృతిక సరిహద్దులను అధిగమించే అంశాలున్నాయి. క ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలని మేమంతా ఆకాంక్షిస్తున్నాం. ఈ చిత్రంలో నేను సత్యభామ పాత్రలో నటిస్తున్నా. సావిత్రి లుక్‌ను స్ఫూర్తిగా సాగుతుంది. అందుకే నేను సావిత్రిని పోలి ఉన్నానని హీరో అన్నాడంటూ చెప్పుకొచ్చింది.
ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం పోస్టు మాస్టర్ వాసుదేవ్‌గా కనిపించబోతున్నాడు. ఈ ఊరేంటి చాలా విచిత్రంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతుందని వాసుదేవ్ ఓ గ్రామస్థుడిని అడిగితే.. మా ఊరు చుట్టూ ఎత్తెన కొండలుంటాయి. కొండల మధ్యలో మా ఊరుంటుంది. మధ్యాహ్నం మూడయ్యే సరికి సూర్యుడు కొండల వెనక్కి వెళ్లిపోయి.. ఆ నీడ మా ఊరి మీద పడి 3 గంటలకే చీకటి పడిపోతుందబ్బాయి.. చీకటి వలయం.. గందరగోళం.. ఏప్రిల్ 22 1977 ఆ రోజు నీకొచ్చిన ఉత్తరాన్ని తెరిచి చదివావు. అందులో ఏముంది.. అంటూ సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచంనాలు పెంచేస్తుంది.
వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యా్మ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Vijay | నటుడు విజయ్ తొలి సభకు భారీ జన సందోహం
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?