వకీల్ సాబ్ లో ఉన్న ఒక్క మైనస్ అదే..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారు. మూడేళ్ల తర్వాత ఆయన నుంచి వచ్చిన వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారు. మూడేళ్ల తర్వాత ఆయన నుంచి వచ్చిన వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అన్నిచోట్ల నుంచి ఈ సినిమాకు బాగుంది అని రిపోర్ట్ రావడంతో దర్శక నిర్మాతలు కూడా ఆనందంగా ఉన్నారు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు కూడా సంతృప్తికరంగానే ఉన్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ సినిమాలో ఒక మెయిన్ మైనస్ ఉంది అని ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రధాన అభియోగం. పింక్ సినిమా మూలం చెడగొట్టకుండా ఈ సినిమాలో సన్నివేశాలు బాగానే అల్లుకున్నాడు వేణు శ్రీరామ్. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా రాసుకున్న కొన్ని సన్నివేశాలు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతగా వర్కవుట్ కాలేదు. కథను అది చాలా ఇబ్బంది పెట్టిందని ఓ రకంగా చెప్పాలంటే అడ్డుపడింది అంటూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా మనసులో మాట చెప్పేశారు. అయితే సెకండాఫ్ మాత్రం సినిమా రేంజ్ ను అమాంతం పెంచేసింది. ఇంటర్వెల్ తర్వాత మొదలైన కోర్టు డ్రామా క్లైమాక్స్ వరకు కొనసాగింది. ఇదే సినిమాకు ఆయువుపట్టు. అయితే ఇక్కడి వరకు సినిమాను తీసుకురావడానికి ఫస్టాఫ్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ చాలా ప్రయోగాలు చేశాడు. ఫ్లాష్ బ్యాక్ మరీ ఎక్కువ సమయం పెట్టారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం జనసేన ప్రచారం సినిమాలో ఎక్కువైంది అంటూ పెదవి విరుస్తున్నారు. ఇది తప్పితే వకీల్ సాబ్ లో వంకలు పెట్టడానికి ఏం లేవు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే..?
చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
కీలక స్థానానికి చిరంజీవి రాజీనామా..?
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

