మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం సీతారామమ్ (Sita Ramam). పీరియాడిక్ లవ్‌స్టోరీతో వార్ బ్యాక్ డ్రాప్లో హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుండగా..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీ రోల్ చేస్తోంది. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే మేకర్స్ రష్మిక ( Rashmika Mandanna), సుమంత్ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా..ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రష్మిక కశ్మీరీ యువతి అఫ్రీన్‌గా కనిపించనుండగా..సుమంత్ బ్రిగేడియర్ విష్ణు శర్మగా నటిస్తున్నాడు. తాజాగా తరుణ్ భాస్కర్ లుక్ (Tharun Bhaskar look) కూడా రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో బాలాజీ పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని కూల్ డ్రింక్ తాగుతూ కనిపిస్తున్నాడు. సినిమా నుంచి విడుదలవుతున్న ఒక్కో స్టిల్ క్యూరియాసిటీని పెంచుతోంది.
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
"Balaji hai na.. sab sambhal lega".
Introducing @TharunBhasckerD as 𝐁𝐚𝐥𝐚𝐣𝐢 from #SitaRamam.https://t.co/09cTI4qvZ2@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @iSumanth @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/2r3lOP7B4i
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 13, 2022