Tharun Bhascker | పెళ్లి చూపులు సినిమాతో ఎంట్రీలోనే డైరెక్టర్‌గా సూపర్ హిట్టందుకున్నాడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). ఈ టాలెంటెడ్ దర్శకుడు ఓ యువ నటితో డేటింగ్లో ఉన్నాడంటూ కొన్నాళ్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయని తెలిసిందే. అయితే ఇంతకీ ఆ భామ ఎవరై ఉంటుందా..? అని తెగ చర్చించుకుంటుండగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌తో పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేశాడు తరుణ్ భాస్కర్.
తాను లవ్‌లో ఉన్నానన్న తరుణ్ భాస్కర్.. ఇంతకీ ఆ బ్యూటీ పేరేంటో మాత్రం చెప్పలేదు. రాజు వెడ్స్ రాంబాయి ప్రీ రిలీజ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్‌ను మీ లైఫ్‌లో చూసిన గొప్ప ప్రేమ కథ ఏదో చెప్పాలని యాంకర్ అడిగింది. దీనికి తరుణ్ భాస్కర్ స్పందిస్తూ.. ‘నా ప్రేమకథ. ప్రస్తుతం నేను అనుభూతిని ఆస్వాదిస్తున్నా. అది ఇంకా కొనసాగుతోంది..’ అన్నాడు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా తరుణ్ భాస్కర్ ఆ నటి గురించి పరోక్షంగా ఇలా చెప్పాడంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు.
ఇక తరుణ్ భాస్కర్ మాటలు విన్న నెటిజన్లు ఆ భామ ఈషారెబ్బానే కదా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో తరుణ్ భాస్కర్, ప్రేయసి ఈ వార్తలపై ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
తరుణ్ భాస్కర్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్ట్ జయ జయ జయ జయ హే (Jaya Jaya Jaya Jaya Hey) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీలో ఈషా రెబ్బా (Eesha Rebba) హీరోయిన్గా నటిస్తోంది. సజీవ్ ఏఆర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఓం శాంతి శాంతి శాంతి : టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh | చాలా బాధగా ఉంది.. AI డీప్‌ఫేక్ చిత్రాలపై కీర్తి సురేష్ ఎమోషనల్
Kapoor Family | కపూర్ ఫ్యామిలీ డిన్నర్లో కనిపించని ఆలియా భట్.. కారణం చెప్పిన అర్మాన్ జైన్!