Kapoor Family | బాలీవుడ్ స్టార్ కుటుంబం కపూర్ ఫ్యామిలీకి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ వేదికగా డాక్యుమెంటరీ సిరీస్ రాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ దిగ్గజ నటుడు రాజ్ కపూర్ 100వ బర్త్‌డే సందర్భంగా ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ (Dining With The Kapoors) అనే పేరుతో రూపొందిన ఈ ఫ్యామిలీ డాక్యుమెంటరీ నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ డాక్యుమెంటరీలో కపూర్ కుటుంబానికి చెందిన అగ్ర నటులు రణ్‌బీర్ కపూర్, కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్ తదితర ప్రముఖులు తమ కుటుంబ అనుబంధాలు, జ్ఞాపకాలు, బాల్యం గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకోనున్నారు. బాలీవుడ్ లెజెండ్, పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ల వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ కుటుంబంలోని ప్రస్తుత తరం స్టార్స్ జీవిత విశేషాలు అభిమానులకు ఆసక్తికరంగా మారనున్నాయి. అయితే ఈ సిరీస్‌కి సంబంధించి ఇటీవలే ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఈ ట్రైలర్లో కపూర్ ఫ్యామిలీకి చెందిన ఆలియా భట్ కనిపించడంతో నెటిజన్లకి అనుమానాలు మొదలయ్యాయి. కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ ఉన్నా.. రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ ఇందులో లేకపోవడంపై పెద్ద చర్చ మొదలైంది. దీంతో ఆలియాకి, కపూర్ ఫ్యామిలీకి గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై కపూర్ కుటుంబ సభ్యుడు అర్మాన్ జైన్ స్పందిస్తూ.. ఆలియా భట్ రాకపోవడానికి గల అసలు కారణాన్ని వెల్లడించాడు.
బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్మాన్ జైన్ మాట్లాడుతూ.. ఆలియా భట్ ఈ డాక్యు సిరీస్ షూటింగ్ చేస్తున్న సమయంలో వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. అందుకే ఈ షోకి ఆలియా హాజరుకాలేదు. అంతే తప్ప ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు లేవంటూ అర్మాన్ చెప్పుకోచ్చాడు.