తమన్ గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనాతో మరణించిన కీబోర్డు ప్లేయర్ ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందించాడు. అంతేకాకుండా వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. తమన్ చేసిన ఈ సాయాన్ని ఇప్పుడు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది మరణించారు. తమన్‌తో పాటు చాలామంది సంగీత దర్శకుల వద్ద కీబోర్డు ప్లేయర్ గా పనిచేసిన కమల్ కుమార్ కూడా ఇటీవల కరోనాతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి పలువురు సంగీత దర్శకులతో పాటు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కమల్ ది పేద కుటుంబం కావడం.. ఆ కుటుంబంలో పోషించేవాడు కూడా ఈయనే కావడంతో కొందరు సినీ ప్రముఖులు ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే ఇప్పుడు వాళ్ల అందరి కంటే సంగీత దర్శకుడు తమన్ మరింత ఉదారంగా ప్రవర్తించాడు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా అండదండగా నిలబడతానని మాటిచ్చాడు. కమల్ కుమార్ కొడుకు చదువు బాధ్యతలు పూర్తయ్యే వరకు ఆ బాధ్యత తాను తీసుకోవడానికి సిద్ధమయ్యాడు తమన్.
తన దగ్గర పనిచేసిన కీబోర్డ్ ప్లేయర్ కావడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు ఈ సంగీత దర్శకుడు. చిన్న వయసులోనే కమల్ వెళ్లిపోవడం నిజంగానే అందరికీ బాధాకరం అంటూ సంతాపం వ్యక్తం చేశాడు. ఒకవైపు వరస సినిమాలు చేస్తూనే మరోవైపు ఇలాంటి సేవా దృక్పథంలోనూ ముందున్నాడు తమన్. ప్రస్తుతం ఈయన దాదాపు 15 సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా తమన్ చేసిన సాయం చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
తారక్ ప్రాజెక్టులన్నీ ఆలస్యం..!
క్వారంటైన్లో ఉన్న నాన్న కోసం స్పెషల్ దోశె వేసిన అర్హ
మహేష్ బాబు సినిమాతో జాన్వీ ఎంట్రీ పక్కానా..!