క్వారంటైన్లో ఉన్న నాన్న కోసం స్పెషల్ దోశె వేసిన అర్హ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా కరోనా సోకిన విషయాన్ని తెలియజేసిన బన్నీ హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపాడు. అంతేకాదు తనకు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయని, అభిమానులు ఎవరు ఆందోళన చెందనక్కర్లేదని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయితే క్వారంటైన్లో ఉన్న బన్నీ తన పిల్లలు చేస్తున్న అల్లరి, తుంటరి పనులను గమనిస్తూ వాటికి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు.
ఇటీవల ఇంట్లోను మాస్క్‌తో ఉన్న అర్హ తన తల్లి స్నేహా రెడ్డితో ఆడుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక తాజాగా తన కోసం అర్హ వేసిన స్పెషల్ దోశె వీడియోని షేర్ చేస్తూ.. నాన్నకి అర్హ స్పెషల్ దోశె. గతంలో నేను వేసిన దోశె స్టెప్పుని ఆదర్శంగా తీసుకొని ఇలా వేసిందేమో. నా జీవితంలో మరచిపోలేని దోశె అంటూ వీడియోకి కామెంట్ పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- arha
- dosa
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

