Thalapathy Vijay 66 | విజయ్ సినిమాలకు ఒకప్పుడు తెలుగులో అంతగా మార్కెట్ ఉండేది కాదు. ఆయన సినిమాలు విడుదల చేస్తే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావనే విమర్శలు ఎంతోకాలం వచ్చాయి. కేవలం తమిళ ఇండస్ట్రీపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల చాలాకాలం టాలీవుడ్ మార్కెట్ సొంతం చేసుకోలేకపోయాడు విజయ్. అయితే కొన్నేళ్లుగా ఆయన ఆలోచన శైలి మారింది. సీరియస్‌గా తెలుగు మార్కెట్‌పై దృష్టి పెట్టిన తర్వాత విజయ్ సినిమాలు తెలుగులో కూడా సంచలన విజయం అందుకుంటున్నాయి. తుపాకీ, పోలీసోడు లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అదిరింది నుంచి తెలుగులోనూ వరుస విజయాలు అందుకుంటున్నాడు.
ఇక్కడ కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకుంటున్నాడు విజయ్. దానికి గతేడాది వచ్చిన మాస్టర్ సినిమానే నిదర్శనం. మొన్న సంక్రాంతికి కూడా ప్యాండమిక్‌లో 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైనా కూడా విజయ్ గత సినిమాల రికార్డులను ఈ సినిమా క్రాస్ చేసింది. క్రాక్, రెడ్ లాంటి తెలుగు సినిమాలు పోటీలో ఉన్నా కూడా దాదాపు 13 కోట్ల ఫైనల్ షేర్ వసూలు చేసింది మాస్టర్. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాకు తెలుగు ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా అధికారికంగా జరిగాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది.
వంశీ చెప్పిన కథ నచ్చడంతో విజయ్ ఈ సినిమాపై ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు. ఇందులో నటించడానికి ఏకంగా విజయ్ 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. రెండు భాషల్లో విజయ్‌కి ఉన్న మార్కెట్ రేంజ్ తెలిసి దిల్ రాజు కూడా అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓకే అన్నాడని తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత తెలుగులో విజయ్ మార్కెట్ రెండింతలు పెరిగిపోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇన్ని రోజులు కేవలం 12 కోట్ల దగ్గర ఆగిన విజయ్ మార్కెట్.. వంశీ పైడిపల్లి సినిమా విజయం సాధిస్తే కచ్చితంగా 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అన్నట్లు ఏప్రిల్ 13న బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్. దీనికి కూడా తెలుగులో దాదాపు 13 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తానికి చూడలేక వంశీ సినిమా తెలుగులో విజయ్ ఎలాంటి మార్కెట్ సొంతం చేసుకోబోతున్నాడో..!
Rashmika Mandanna | ‘నాలో ఏదో తెలియని ఫీలింగ్’..రష్మిక ట్వీట్ వైరల్”
“Vijay 66th Launch | విజయ్ 66వ సినిమా మొదలెట్టాడు..రష్మిక సందడి షురూ”
Halamithi Habibo Telugu Song | హలమితి హబిబో తెలుగు వెర్షన్ వచ్చేసింది..లిరికల్ వీడియో”
Krithi Shetty Halamithi Dance | హలమితి హబిబో పాటకు కృతిశెట్టి డ్యాన్స్ కేక..వీడియో హల్చల్”