Telugu Film Chamber of Commerce | తెలుగు సినిమాలకు గుర్తింపు ఇప్పుడు పాన్ ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా వస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమంను నిర్వహించింది. ఈ వేడుకలో సినీయర్ నటులు మురళీమోహన్ , రచయిత పరిచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, రచయిత జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ వేడుకలో ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా దినోత్సవంగా ప్రకటించింది ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆనంతరం సినీ పరిశ్రమకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ తరపున కూడా ఆవార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 06న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది. అలాగే ఫిబ్రవరి 06న ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని.. తెలిపింది. ఈ జెండా రుపకల్పనకు సంబంధించి బాధ్యతలను రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించింది ఛాంబర్ ఆఫ్ కామర్స్.
ఇదిలావుంటే ఈ అవార్డులు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న గద్దర్ సినిమా అవార్డులకు పోటిగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి ఫిలిం ఇండస్ట్రీలోని సభ్యులకు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తకరంగా మారింది.
Also Read..