Shekar Basha | పాపులర్ ఆర్జే, బిగ్ బాస్ సీజన్ 8 ఫేం శేఖర్ బాషా (Shekar Basha) ఇప్పటికే ఓ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అతనిపై మరోకేసు నమోదైంది. శేఖర్ బాషాపై కొరియోగ్రఫర్ స్రష్టి వర్మ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
జానీ మాస్టర్ కేసు విచారణ జరుగుతుండగా.. తన వ్యక్తిగత కాల్ రికార్డులను శేఖర్ బాషా లీక్ చేశాడని, తన పరువుకు భంగం కలిగేలా కొన్ని యూట్యూబ్ చానెళ్లలో మాట్లాడారని కొరియోగ్రఫర్ స్రష్టి వర్మ పిర్యాదు చేసినట్టు సమాచారం.
దురుద్దేశపూర్వకంగా తన ప్రైవేట్ కాల్స్ రికార్డులను లీక్ చేశాడని, శేఖర్ బాషా దగ్గరున్న పర్సనల్ మొబైల్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా సీజ్ చేయాలని పోలీసులను కోరింది. ఈ నేపథ్యంలో నార్సింగి పోలీసులు శేఖర్ బాషాపై బీఎన్ఎస్ యాక్ట్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద కేసులు నమోదు చేసినట్టు సమాచారం. గతంలో జానీ మాస్టర్‌పై కూడా స్రష్టి వర్మ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Read Also :
Samuthirakani | ‘ఒక పథకం ప్రకారం’ పట్టుకుంటే రూ.10 వేలు.. సముద్రఖని బంపర్ ఆఫర్
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్