తెలంగాణ ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయమవుతున్నాడు. వడత్యా హరీష్ దర్శకుడు. మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాత. నేడు ప్రేక్షకులముందుకురానుంది.
ఈ సందర్భంగా గురువారం దర్శకుడు వడత్యా హరీష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘1969 నుంచి ఈ కథను తీసుకున్నాం. ఉద్యమ నాయకుడి బాల్యం మొదలుకొని కాలేజీ జీవితం, ఉద్యమ ప్రస్థానం.. ఉన్నత పదవిని చేపట్టడం వరకు సాగుతుంది. కథ అనుకున్నప్పుడే శ్రీకాంత్‌ను ఉద్యమ నాయకుడి పాత్రలో ఊహించుకున్నా. ఆయన ఇప్పటివరకు ఎన్నో రాజకీయ నేపథ్య సినిమాలు చేశారు కానీ..ఈ తరహా పాత్రను ఎప్పుడూ పోషించలేదు. శక్తివంతమైన హీరోయిజంతో ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. ఉద్యమ నాయకుడి పాత్రలో ఆయన జీవించారు. శ్రీకాంత్ చిన్ననాటి పాత్రను జిషాన్ పోషించాడు. ఆసాంతం చక్కటి భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం. వినోదం కూడా మెప్పిస్తుంది. పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, ఆలీ, జబర్దస్త్ బృందంలో నలుగురుతో పాటు మరికొందరు ఈ సినిమాలో నటించారు’ అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ నెల 12న తెలంగాణ దేవుడు రిలీజ్
Pushpa Promotional Event | పుష్ప స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
NBK107 Launch Date | బాలకృష్ణ-గోపీచంద్ ఎంటర్టైనర్ లాంఛింగ్ టైం ఫిక్స్
mega154 | చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో?
బాబోయ్ ఇది ఊర నాటు.. మాస్ డాన్సులతో కుమ్మేసిన చరణ్, ఎన్టీఆర్..
Brahmanandam Rejection | బ్రహ్మానందంను సినిమా నుంచి తొలగించిన నితిన్..?