Adbhutam | తేజ సజ్జా అద్భుతం ఓటీటీలోనే రిలీజ్… వచ్చేది ఎప్పుడంటే..

teja sajja Adbhutam | బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి.. ఇప్పుడు హీరోగా నిలబడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు తేజ సజ్జా. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చాడు తేజ సజ్జా. ఏడాది మొదట్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జాంబి రెడ్డి’ సినిమాతో వచ్చాడు. కరోనా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అలాగే ఆ తర్వాత ఇష్క్ ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ అంటూ వచ్చాడు. ఇది మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కనీసం కోటి రూపాయల షేర్ కూడా తీసుకురాలేకపోయింది. ఇప్పుడు ఏడాదిలో మూడో సినిమా విడుదలకు సిద్ధమైపోయింది. తేజ సజ్జా హీరోగా.. రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా అద్భుతం. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 19న విడుదల కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘అద్భుతం’ ట్రైలర్ చూస్తుంటే ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సాగే సైంటిఫిక్ ఫిక్షన్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించాడు. తేజ సజ్జా, శివాని వేర్వేరు ప్రదేశాల్లో ఉండగా.. ఈ ఇద్దరికి ఒకే ఫోన్ నెంబర్ వస్తుంది. అప్పట్నుంచి ఆ ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన కథ. ఈ సినిమాలో తులసి, శివాజీ రాజా, సత్య, హర్ష, మిర్చి కిరణ్, దేవీ ప్రసాద్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్న లక్ష్మీ భూపాల.. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. రాధన్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చేస్తున్నాడు. మహాతేజ క్రియేషన్స్, ఎస్.ఒరిజినల్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Hrithik Roshan Telugu Remake | నాని సినిమాపై కన్నేసిన బాలీవుడ్ స్టార్ హీరో..!
Anasuya: గుండు కొట్టించుకుంటానంటున్న అనసూయ.. ఎందుకో తెలుసా?
Venkatesh: నిన్ను నమ్మిన వాళ్లను ఎప్పుడు మోసం చేయోద్దు.. వెంకటేష్ పోస్ట్ వైరల్
Samantha:ఆ హీరోయిన్ ఆపరేషన్ ఖర్చంతా భరించిన సమంత.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్
Karthikeya | కార్తికేయకు కాబోయే భార్య ఆర్ఎక్స్100 సినిమా ఎందుకు చూడలేదో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

