రికార్డ్ మోతలు.. బతుకమ్మ పాటలు
అందరి పండుగ బతుకమ్మ. ఆ తల్లిని కొలిచే పాటల్లో జానపదం పల్లవిస్తుంది. ప్రజల కష్టసుఖాలు ప్రస్తావన లేకుండా బతుకమ్మ పాట ఉండదు. తరతరాలుగా వస్తున్న ఇలాంటి పాటలకు తోడుగా ఏటా కొంగొత్తబతుకమ్మ పాటలు సృష్టిస్తున్నారు సృజనశీలురు. బతుకమ్మ సందర్భంగా అద్భుతమైన పాటలు అల్లి, అత్యద్భుతంగా చిత్రించి యూట్యూబ్ వేదికగా విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇదే ఒరవడి కొనసాగింది.కొత్త కొత్త బతుకమ్మ పాటలతో తెలంగాణ నేల ఉప్పొంగుతున్నది.
అందరి పండుగ బతుకమ్మ. ఆ తల్లిని కొలిచే పాటల్లో జానపదం పల్లవిస్తుంది. ప్రజల కష్టసుఖాలు ప్రస్తావన లేకుండా బతుకమ్మ పాట ఉండదు. తరతరాలుగా వస్తున్న ఇలాంటి పాటలకు తోడుగా ఏటా కొంగొత్తబతుకమ్మ పాటలు సృష్టిస్తున్నారు సృజనశీలురు. బతుకమ్మ సందర్భంగా అద్భుతమైన పాటలు అల్లి, అత్యద్భుతంగా చిత్రించి యూట్యూబ్ వేదికగా విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇదే ఒరవడి కొనసాగింది.కొత్త కొత్త బతుకమ్మ పాటలతో తెలంగాణ నేల ఉప్పొంగుతున్నది. మన సద్దుల పాటలు యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్ కొల్లగొడుతున్నాయి. ఆ పాటలకు చప్పట్లు కలుపుతూ అవని మురిసేలా మన ఆడపిల్లలుబతుకమ్మ ఆడుకుంటున్నారు. పల్లె, పట్నంలో మార్మోగుతున్న ఆ పాటల్లో కొన్ని ఇవి..
పాట: సింగిడి చిన్నబోయినాది అమ్మను చూసి
సింగర్: మంగ్లీ
లిరిక్స్: మాట్ల తిరుపతి
వ్యూస్: 27 లక్షలు

Mangli
బతుకమ్మ పాటలకు పెట్టింది పేరు మంగ్లీ. స్వరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఏటా కొత్త బాణీలతో కొంగొత్త బతుకమ్మ పాటను పరిచయం చేస్తున్నదామె.
‘ఆ సింగిడి చిన్నబోయినాది అమ్మను చూసి.. ఆ రంగులే తడబడినయి బొడ్డెమ్మను చూసి’ అనే పల్లవితో ఈసారి ముందుకొచ్చింది. ఈ నేలపై జరిగే రంగురంగుల పూల బతుకమ్మ వేడుకను చూసి హరివిల్లు సైతం చిన్నబోయిందంటూ మన పండుగ ప్రత్యేకతను తెలిపింది. ఈ పాట వింటుంటే మన అకాచెల్లెళ్లంతా ముంగిట్లో కూర్చుని తల్లితో కలిసి పూలు కడుతున్న అనుభూతి కలుగుతుంది. మంగ్లీ గొంతులోని రస్టిక్ టచ్, ప్రతి ఆడబిడ్డకూ తన అమ్మమ్మ పాడిన జోలపాటను గుర్తు చేస్తుంది. అందుకే ఈ పాట లక్షల్లో వ్యూస్ కొల్లగొడుతున్నది.
పాట: ఆ కోలలీకోలలే గౌరమ్మ
సింగర్: మధుప్రియ
లిరిక్స్: కమల్ ఎస్లావత్
వ్యూస్: 19 లక్షలు

బతుకమ్మ పండుగంటేనే ప్రకృతిని కొలిచి మొక్కడం. ఊరు ఊరంతా సందడి, గునుగు, తంగేడు పూలన్నీ ఇంటికి చేరే ఆ తీరు… ఒక్క తెలంగాణలోనే సాధ్యం. ‘ఆ కోలలీకోలలే గౌరమ్మ దేవసారీ కోలలే’ అంటూ కమల్ ఎస్లావత్ రాసిన పాట సంచలనమైంది. మధుప్రియ గాత్రంలో మధురంగా సాగిపోయింది. పండుగొస్తే కొత్త
దుస్తుల సందడి, గల్లిగల్లీలో బతుకమ్మ ఆట పాటలు ఇలా తీరొక్క పూల బతుకమ్మను గొప్పగా కొలుచుకుంటామని ఈ పాట చాటి చెబుతున్నది. ఇక ఈ ఏడాది మధుప్రియ పాడిన మరో బతుకమ్మ పాట ‘పాటలేమని పాడమే బతుకమ్మ, ఆటలెట్ల ఆడమే మాయమ్మ..’. నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర, బతుకమ్మ పండుగకు ఆయన ఇచ్చిన అధికారిక గుర్తింపును గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలనలో సంభవించిన కరువును మన కండ్లకు కట్టి పాడింది. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ వైభవాన్ని చాటిందీ పాట. కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రం, మన పండుగ ఎలా ఆగమైపోతున్నయో కండ్లకు కట్టింది. ఈ పాట ఇప్పటికే 165కే వ్యూస్కు చేరడం విశేషం.
పాట: బైలెల్లిరాయే బతుకమ్మ
లిరిక్స్-సింగర్: సామి నరేష్ దుబ్బా
వ్యూస్: 18 లక్షలు

Tonlkntonlkntonl
సంప్రదాయ బాణీ చెడకుండా డీజే బీట్ జోడించి యువతకు చేరువైంది ఈ పాట. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మకు నీరజనంగా ఈ పాటను అందించాడు సామి నరేష్. బతుకమ్మ పండుగకు ముందే వచ్చిన ఈ పాట రీల్స్లో తెగ వైరలైంది. ప్రతీ ఆడపిల్ల ఈ పాటలో తనను తను ఊహించుకునేలా సాహిత్యం అందించాడు రచయిత. ఈ పాట వింటే చెరువు కట్ట మీద నిమజ్జనం సమయంలో అకాచెల్లెళ్ల సంబురం గుర్తుకువస్తుంది. రీల్స్, షార్ట్స్ చేసే అమ్మాయిలకు ఇది పర్ఫెక్ట్ పాట. డీజే మోతల్లో ఈ పాట మోగుతుంటే పిల్లాజెల్లా అంతా కలిసి స్టెప్పులేస్తున్నరు.
రాజు పిల్లనగోయిన
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

