కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం
తమ అసమర్థతను ఎల్ నినోపై నెట్టేసి.. సాగునీళ్లు, కరెంటుపై చేతులెత్తేసిన సీఎం రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ రైతాంగం నిప్పులు చెరుగుతున్నది.
- కరోనాలోనూ మీరు అండగా ఉన్నరు
- కరువులోనూ రేవంత్ చేతులెత్తేసిండు
- ఓ న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో కరీంనగర్ రైతు నారాయణ ఆవేదన
హైదరాబాద్, అక్టోబర్ 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని ప్రతి రైతు కుటుంబం ఇప్పుడు ఆలోచనలో పడింది. దీన్ని ధ్రువీకరిస్తూ శుక్రవారం ఓ తెలుగు న్యూస్ చానల్ నిర్వహించిన డిబేట్లో ఫోన్ ద్వారా పాల్గొన్న కరీంనగర్‌కు చెందిన బాల నారాయణ అనే రైతు.. కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పుచేశామని, ఇందుకు కేసీఆర్ సార్ అందర్నీ క్షమించాలని లైవ్‌లోనే విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
నీళ్లు లేవన్న సీఎంను ఏమనాలె?
డిబేట్లో బాల నారాయణ మాట్లాడుతూ ‘2023లో అనవసరంగా వంకరగా ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేసినం. క్షమించండి కేసీఆర్ సార్. ఇంకోసారి ఇలా జరుగదు. జీవితంలో కాంగ్రెస్‌కు ఓటెయ్యాలంటే, ప్రతి ఓటరు కూడా ఆలోచించే స్థాయికి ఇప్పుడు వచ్చిండు. తెలంగాణలో ఆణిముత్యాల్లాంటి మంచి ఇంజినీర్లు ఉన్నరు. వాళ్లు ఇచ్చే సలహాలు, సూచనలను సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటలేడు. తెలంగాణకు కాళేశ్వరం ఓ వరప్రదాయిని. అట్లాంటి ప్రాజెక్టును ఎండబెట్టిండు. ఇప్పుడు తిందామంటే కూడా బువ్వ దొరకని పరిస్థితి తెచ్చిండు. చివరికి నీళ్లు కొందామంటే కూడా దొరుకుతలేవు అనే మాటలు ఒక ముఖ్యమంత్రి నుంచి వస్తున్నయంటే ఇగ ఏమనాలె?’ అంటూ బాల నారాయణ నిప్పులు చెరిగారు. కరువు పరిస్థితులపై స్పందిస్తూ ‘10 నెలల కిందట మేల్కొని ఉంటే ఇలా అయ్యేది కాదు కదా’ అంటూ రేవంత్ సర్కార్‌కు చురకలంటించారు.
చేతులెత్తేసిన రేవంత్
‘నిన్న రేవంత్‌రెడ్డి టీవీల్లో మీటింగ్ పెట్టిండు. దాన్ని నేను కూడా చూసిన. ఒకవేళ ఇదే పరిస్థితుల్లో కేసీఆర్ మీటింగ్ పెడితే ప్రజలకు ఒక హామీ, భరోసా ఇచ్చేవారు. కరోనా వచ్చినప్పుడు రూ.10 వేల కోట్లు ఖర్చు అయినా సరే.. నా తెలంగాణ ప్రజలను నేను బతికించుకొంటా అని ప్రజలకు ఆశ, భరోసా కల్పించారు. కానీ, ఇప్పుడు రేవంత్‌రెడ్డి మాత్రం మొత్తమే చేతులెత్తేసిండు. పది నెలల వరకూ కరెంట్ ఉండదు అంటుండు. మేమెన్నడూ బియ్యం కొనలేదు. ముఖ్యంగా నాలుగేండ్ల నుంచి అస్సలు కొనలేదు.
బియ్యం ఇప్పుడు క్వింటాల్ రూ.8000 అయ్యింది. మాకు రెండు బోర్లు ఉంటే రెండూ ఎండిపోయినయ్. చెరువు పక్కనే మా భూములు ఉంటయ్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టైమ్‌కు చెరువు కళకళలాడేది. గ్రౌండ్ వాటర్ ఉండి బోరు పోసేది. బియ్యం బాగా పండేవి. ఇప్పుడలా లేదు. రాబోయే రోజుల్లో కరెంట్ ఉండదని సీఎం అంటుండు. బియ్యం కొనాలంటుండు. మొత్తంగా పరిస్థితులు ఎలా ఉంటయో అర్థంకాకుండా ఉన్నది’ అంటూ బాల నారాయణ వాపోయాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- farming family
- Voting
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

