Pelli Choopulu Movie | విజయ్ దేవరకొండ కెరీర్లో ‘పెళ్ళి చూపులు’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నటుడిగా స్ట్రగుల్ అవుతున్న టైంలో ‘పెళ్ళి చూపులు’ సినిమా విజయ్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. హీరోగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై సంచలన విజయం సాధించింది. నటీనటుల నాచ్యురల్ పర్ఫార్మెన్సెస్, తరుణ్ భాస్కర్ టేకింగ్, డైలాగ్స్ సినిమాను భారీ విజయం సాధించేలా చేశాయి. ఈ చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే తరుణ్‌భాస్కర్ మందుగా ఈ కథను విజయ్ దేవరకొండతో కాకుండా ఆ యంగ్ హీరోతో చేయాలని అనుకున్నాడట.
ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరా అనుకుంటున్నారా? తను మరెవరో కాదు ‘కార్తికేయ’ హీరో నిఖిల్. తరుణ్‌భాస్కర్ ముందుగా ‘పెళ్ళి చూపులు’ కథను నిఖిల్‌కు చెప్పాడట. నిఖిల్‌కు కూడా కథ బాగా నచ్చి, వెంటనే చేసేద్దాం అని కూడా చెప్పాడట. అయితే అప్పటికి ప్రొడ్యూసర్ ఇంకా ఫైనల్ అవలేదు. దాంతో తరుణ్ భాస్కర్ ప్రొడ్యూసర్‌ను వెతికే పనిలో ఉన్నాడట. ఈ లోగా నిఖిల్ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ సినిమాతో బిజీ అయ్యాడు. అయితే ఒక రోజు నిఖిల్, తరుణ్‌కు ఫోన్ చేసి.. సినిమా చేద్ధాం. నేనే ప్రొడ్యస్ చేస్తా అన్నాడట. కాగా అంతలోనే విజయ్ హీరోగా ఓకే అవడం, ప్రొడ్యూసర్ దొరకడం జరిగిపోయిందట. ఇప్పటికి ఆ సినిమాను మిస్ చేసుకున్నందుకు నిఖిల్ ఫీల్ అవుతూ ఉంటాడట. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా చెప్పాడు.
Read Also:
Sita Ramam | సీతా రామం మ్యాజిక్ ఇప్పుడు అక్కడ మొదలైంది.. ఆపడం కష్టమే!
Puri Jagannadh | పూరీ జగన్నాథ్ యూటర్న్..యువ హీరోతో నెక్ట్స్ సినిమా..?
Sita Ramam | ‘నా దేశం పరువు మీతో పంపలేను కదా మేడం’.. ‘సీతారామం’ డిలీటెడ్ సీన్ రిలీజ్
Karthikeya-2 Movie | బాలీవుడ్లో ‘కార్తికేయ-2’ సరికొత్త రికార్డు..!