Sita Ramam | ‘నా దేశం పరువు మీతో పంపలేను కదా మేడం’.. ‘సీతారామం’ డిలీటెడ్ సీన్ రిలీజ్
Sita Ramam Movie Deleted Scene | ఈ ఏడాది బ్లాక్బాస్టర్ చిత్రాలలో ‘సీతారామం’ ఒకటి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ఘన విజయం సాధించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే హిందీలో విడుదలై అక్కడ కూడా మంచి విజయం సాధించింది. బాలీవుడ్లో రోజు రోజుకు ఈ సినిమాపై ఆధరణ పెరుగుతూనే ఉంది. తెలుగులో ఈ సినిమాకు దాదాపు రూ.30 కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చాయి. ఇలాంటి ఒక పీరియాడికల్ ఫీల్ గుడ్ మూవీకి, పైగా మలయాళ హీరోకు ఈ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయంటే విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రంతో దుల్కర్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. సినిమా విడుదలై నెల రోజులైన ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమా డిలీటెడ్ సీన్‌ను విడుదల చేశారు.
సీతా మహాలక్ష్మీ కోసం రష్మిక వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ఓ ప్యాలెస్ దగ్గరికి క్యాబ్‌లో వెళ్తుంది. అయితే తన బ్యాగ్‌ను క్యాబ్‌లోనే మరచిపోయి లోపలికి వెళ్తుంది. బ్యాగ్ కోసం వెనక్కి వచ్చి డ్రైవర్ని ‘ఇంకా ఇక్కడే ఉన్నావా.. పర్లేదు, ఇండియాలో కూడా నీలాంటి వాళ్ళున్నారన్న మాట’ అని అంటుంది. దానికి క్యాబ్ డ్రైవర్ ‘ఇండియాలో అందరూ నాలానే ఉంటారు. మీ బ్యాగ్ తీసుకపోయి నా దేశం పరువు మీతో పంపలేను కదా మేడం’ అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. దీనిపై పలువురు నెటీజన్లు ఇంత మంచి సీన్‌ను ఎందుకు ఎడిట్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పీరియాడిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించాడు. దుల్కర్‌కు జోడీగా మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించింది. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది. సుమంత్, తరుణ్‌భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

