Sita Ramam | సీతా రామం మ్యాజిక్ ఇప్పుడు అక్కడ మొదలైంది.. ఆపడం కష్టమే!
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన ప్రేమ కావ్యం సీతా రామం. ఎప్పుడో దశాబ్దానికి కూడా రాని అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ఇదే అంటూ అందరూ ప్రశంసల వర్షం కురిపించారు ఇప్పటికే తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో కూడా సీత రామం సినిమా సంచలన విజయం సాధించింది. కేవలం 17 కోట్ల బాక్సాఫీస్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే 43 కోట్ల షేర్ వసూలు చేసి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇలాంటి అందమైన సినిమాను కేవలం సౌత్ కు మాత్రమే పరిమితం చేయకుండా సెప్టెంబర్ 2న హిందీలో కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. చాలా తక్కువ థియేటర్స్ లో.. తక్కువ పబ్లిసిటీతో విడుదలైన సీత రామం సినిమా హిందీ వర్షన్ కు కూడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఎలాంటి ప్రమోషన్ లేకుండా విడుదలనే ఈ సినిమాకు కేవలం మౌత్ పబ్లిసిటీ కారణంగా రోజురోజుకు వసూళ్లు పెరుగుతుండడం దర్శక నిర్మాతలకు సంతోషాన్ని కలిగిస్తుంది.
ఇప్పటికే హిందీలో 4 కోట్ల గ్రాస్.. రెండు కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఈ వీకెండ్ నాటికి పరిస్థితి ఇంకా బాగుంటుందని నమ్ముతున్నారు మేకర్స్. బ్రహ్మాస్త్ర లాంటి భారీ సినిమా వస్తున్నా కూడా.. కంటెంట్ బలంగా ఉండడంతో హిందీలో సీత రామం కచ్చితంగా మ్యాజిక్ చేస్తుందని వాళ్లు నమ్ముతున్నారు. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మించారు.
సౌత్ లో క్లాసిక్ హోదాను అందుకున్న ఈ సినిమా హిందీలో కూడా అదే వైపు పరుగులు పెడుతుంది. అన్నట్టు సీతా రామం సినిమా విడుదల కముందే హను రాఘవపూడి బాలీవుడ్ లో సినిమాకు కమిట్ అయ్యాడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. సన్నీ డియోల్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Puri Jagannadh | పూరీ జగన్నాథ్ యూటర్న్..యువ హీరోతో నెక్ట్స్ సినిమా..?
బాలీవుడ్ ను ‘బ్రహ్మాస్త్ర’ బయట పడేస్తుందా..?
Sita Ramam | ‘నా దేశం పరువు మీతో పంపలేను కదా మేడం’.. ‘సీతారామం’ డిలీటెడ్ సీన్ రిలీజ్
Karthikeya-2 Movie | బాలీవుడ్లో ‘కార్తికేయ-2’ సరికొత్త రికార్డు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

