Karthikeya-2 Movie | బాలీవుడ్లో ‘కార్తికేయ-2’ సరికొత్త రికార్డు..!
Karthikeya-2 Bollywood Record | ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం కార్తికేయ-2. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదలై ఘన విజయం సాధించింది. నిఖిల్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా కార్తికేయ-2 నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో నిఖిల్ వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన ప్రతి భాషలోనూ ఈ చిత్రం డబుల్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు 100కోట్లకు పైగా గ్రాస్‌ను.. 50కోట్లకు పైగా షేర్‌ను సాధించింది. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్లో అరుదైన ఘనతను సాధించింది.
‘కార్తికేయ-2’ చిత్రం బాలీవుడ్లో ఇప్పటివరకు 30కోట్ల నెట్ కలెక్షన్‌ను సాధించింది. ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం విశేషం అనే చెప్పాలి. అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగులో ‘గీతా గోవిందం’ తర్వాత అత్యధిక ప్రాఫిట్స్ను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
HINDI Audience ko 🔥🙏🏽 Dhanyavaad… #Karthikeya2Hindi ko itna pyaar our Support karne ke liye 🙏🏽🙏🏽🙏🏽 Hum Hamesha Abhaari hain 🙏🏽 @anupamahere @AbhishekOfficl @vishwaprasadtg @chandoomondeti @harshachemudu @Actorysr @kaalabhairava7 pic.twitter.com/eS9DAkZPBM
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 6, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
కాంగ్రెస్‌కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

