ఇప్పుడు అందరి మనసులోనూ ఇదే కోరిక ఉంది. ఒక్క హిట్ కావాలని బాలీవుడ్ చాలా రోజుల నుంచి ఆశగా వేచి చూస్తుంది. ఎంత పెద్ద హీరో సినిమా వచ్చినా కూడా నిర్ధాక్షణంగా వెనక్కి తిప్పి పంపిస్తున్నారు ప్రేక్షకులు. దాంతో సినిమాలు విడుదల చేయాలంటే భయపడిపోతున్నారు నిర్మాతలు. అక్కడ అమీర్ ఖాన్ ఉన్న.. అక్షయ్ కుమార్ ఉన్న వాళ్ళ తీర్పు మాత్రం ఒకటే లాగా ఉంది. ఒకప్పుడు సినిమా ఎలా ఉన్నా 200 కోట్లు కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఎంత బాగున్నా కూడా కనీసం 50 కోట్లు రావడం లేదు.
ఇక డిజాస్టర్ సినిమాలకైతే కనీసం 20 కోట్లు కూడా కలెక్షన్స్ రావట్లేదు. ఈ దారుణమైన పరిస్థితి చూసి బాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఓటీటికి ఇచ్చేయాలని ఫిక్స్ అయిపోతున్నారు. అందులో స్టార్ హీరోలు సినిమాలు కూడా ఉన్నాయి. అంత భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలకు కనీసం 50 కోట్లు కూడా రాకపోవడం వాళ్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్య బాయ్ కాట్ ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. ఇలాంటి సమయంలో 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది.
ఈ సినిమా ఓపెనింగ్స్ బాగా ఉంటాయని మేకర్స్ నమ్ముతున్నారు. కాకపోతే రణబీర్ కపూర్, అలియా భట్ లాంటి నెపో కిడ్స్ ఇందులో నటించడంతో దీన్ని కూడా బాయ్ కాట్ చేయాలి అంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రాని ఓపెనింగ్స్ బ్రహ్మాస్త్రకు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్స్ లో బ్రహ్మాస్త్ర జోరు కనిపిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టికెట్ రేట్ బాగా ఎక్కువగా పెట్టారని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి.
ముంబైతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయి. థియేటర్ కు వచ్చే ఆడియన్స్ కు ఇది అడ్డుగోడల మారుతుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా బ్రహ్మాస్త్ర సినిమా ఎలాంటి ఫలితం తీసుకొస్తుంది అనేది మాత్రం అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవేళ ఇది హిట్ అయితే బాలీవుడ్ కోలుకున్నట్లే.మ్ ఏదైనా తేడా కొడితే మాత్రం ఇప్పట్లో కోలుకోవడం సాధ్యం కాదు.
ఇవి కూడా చదవండి..