Thalapathy67 | విజయ్ సినిమాలో బాలీవుడ్ స్టార్?
Thalapathy Vijay- Lokesh kangaraj Movie | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం స్పీడు మీదున్నాడు. వరుసగా కథలను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన ‘బీస్ట్’ తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా ఈ చిత్ర ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ప్రస్తుతం ఈయన వంశీపైడిపల్లి దర్శకత్వంలో నేరుగా తెలుగులో వారసుడు సినిమా చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన విజయ్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను సంప్రదించారట. పాత్ర నచ్చడంతో సంజయ్‌దత్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే. ప్రస్తుతం ఈయన ముఖ్య పాత్రల్లో నటుస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే కేజీఎఫ్, శంషేరా వంటి సినిమాలతో తన విలనిజంతోనూ ప్రేక్షకుల మెప్పు పొందాడు. కాగా ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్లు టాక్.
విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగానే అంచనాలున్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన మాస్టర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం కూడా లోకేష్ తన మల్టీవర్స్‌లో భాగంగానే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రం కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను లోకేష్ రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.
Read Also:
Liger Movie | అప్పుడే ఓటీటీలోకి ‘లైగర్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
God Father | ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్?
Karthikeya-2 Movie | బాలీవుడ్లో ‘కార్తికేయ-2’ సరికొత్త రికార్డు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

