Liger Movie | అప్పుడే ఓటీటీలోకి ‘లైగర్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Liger Movie On OTT | ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఒక హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత దాదాపు రెండేళ్ళు గ్యాప్ తీసుకుని లైగర్‌తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండవ రోజు నుండి ఫుల్ డ్రాప్స్ పడ్డాయి. కనీసం థియేటర్ రెంట్‌కు సరిపడ కలెక్షన్లు కూడా రాకపోవడంతో వారంలోపే సినిమాను తీసేసారు. ఈ సినిమా ఫలితం మేకర్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘లైగర్’ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 30 నుండి స్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. మార్షల్ ఆర్స్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

