Tandel Movie team | తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ‘తండేల్’ (Tandel) చిత్రబృందం దర్శించుకుంది. గురువారం ఉదయం స్టార్ నటులు నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి తితిదే అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ‘తండేల్’ చిత్రం విజయం సందర్భంగా తామంతా తిరుమలకు వచ్చినట్లు చందూ మొండేటి తెలిపారు.
తిరుమల శ్రీవారి దివ్య దర్శనం చేసుకున్న తండెల్ చిత్ర యూనిట్. #NagaChaitanya #SaiPallavi #AlluAravind #Tirumala #AndhraPradesh #UANow pic.twitter.com/K9D4K47eT4
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) February 13, 2025
కాగా, టాలీవుడ్ మూవీ లవర్స్‌తో అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తండేల్ (Thandel) ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) – సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వచ్చిన తండేల్ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
Our queen @Sai_Pallavi92 and team #Thandel at lord venkateswara dharahan in tirumala. ..🙏🕉️#saipallavi @Sai_Pallavi92 @chay_akkineni #Tirupati #Tirumala #thandelblockbuster pic.twitter.com/7BlX27eJJM
— ______sai_pallavi_unstoppable_ (@AFAjayfilms) February 13, 2025
Also Read..
Akkineni Nagarjuna | నిన్ను చూసి గర్వపడుతున్నా.. నాగచైతన్య తండేల్ సక్సెస్‌పై అక్కినేని నాగార్జున
“Allu Arjun | పాకిస్థాన్ కానిస్టేబుల్‌కి అల్లు అర్జున్‌కి సంబంధం ఏంటి.. తండేల్ తెర వెనుక కథ!”