Pakistani constable and Allu Arjun | నాగచైతన్య నటించిన తండేల్ చిత్రం ప్రేక్షకులముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి కథానాయికగా నటించగా.. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంను గీతా ఆర్ట్స్ నిర్మించింది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీకాకుళంకి చెందిన కొందరూ జాలర్లు చేపల వేటకోసమని గుజరాత్ వెళ్లి ఇండియా బోర్డర్ దాటి పాకిస్థాన్‌కి ప్రవేశిస్తారు. దీంతో పాకిస్థాన్ కోస్ట్‌గార్డులు వారిని అరెస్ట్ చేసి పాకిస్తాన్ జైలుకు తరలిస్తారు. దీనినే సినిమాగా మలిచాడు దర్శకుడు చందూ.
అయితే తండేల్ అనే సినిమా ఎలా పుట్టిందని అనే దానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటపడింది. తండేల్ సినిమా కథ పుట్టడానికి పాకిస్థాన్‌లోని ఒక కానిస్టేబుల్ కారణం అని తెలిసింది. ఈ సినిమాలో ఉన్న పాకిస్ధాన్ పోలీస్ పాత్ర నిజ జీవితంలో అల్లు అర్జున్ అభిమాని అని సమాచారం.
గుజరాత్ చేపల వేటకి వెళ్లి పట్టుబడ్డ 22 మంది శ్రీకాకుళం జాలర్లు పాకిస్థాన్ జైలులో ఉండగా.. అక్కడ బందీలుగా ఉన్న భారతీయులకు ఒక పాకిస్థాన్ పోలీస్ సాయం చేసినట్లు చిత్రబృందం తెలిపింది. శ్రీకాకుళం ఖైదీలు భారత్ రావడానికి కూడా అతడే కారణం అని చిత్రబృందం తెలిపింది. అయితే పాకిస్థాన్ పోలీస్ అల్లు అర్జున్‌కి పెద్ద అభిమాని అని.. అతడిని ఒక్కసారైన కలవాలని అనుకునేవాడిని జాలర్లకి చెప్పినట్లు సమాచారం. అలాగే జాలర్లు పాకిస్థాన్ నుంచి భారత్‌కి వెళ్లే ముందు వారిని కలిసిన పోలీస్ నా అడ్రస్ ఇస్తాను నాకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కావాలి అని అడిగినట్లు జాలర్లు తెలిపారు. దీంతో ఆ జాలర్లు గీతా ఆర్ట్స్ కార్యాలయంను సంప్రదించగా.. అది కాస్తా అల్లు అరవింద్ చెవిలో పడడం.. అది తండేల్ కథగా మారడం జరిగిందని సమాచారం.