Odela 2 | టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ఓదెల 2 (Odela 2). సంపత్ నంది (Sampat Nandi) టీం వర్క్స్ బ్యానర్ నుంచి వస్తోన్న ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఇటీవలే టీజర్‌ను రిలీజ్ చేశారని తెలిసిందే.
ఓదెల 2 టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో సంపత్ నంది, తమన్నా టీం సెలబ్రేషన్స్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. టీజర్ సక్సెస్‌ను షేర్ చేస్తూ ఓదెల 2 సెట్స్‌లో కేక్ కట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఓదెల 2 టీం ఓం నమ: శివాయ అంటూ ఇప్పటికే తమన్నా శివశక్తి లుక్ షేర్ చేయగా నెట్టింట పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ఇందులో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించనుందని పోస్టర్ల ద్వారా క్లారిటీ ఇచ్చేశారు.
ఈ చిత్రంలో వశిష్ఠ ఎన్ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్‌పై తెరకెక్కిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఓదెల 2 కోసం తమన్నా శివశక్తి రూపంలోకి ఎలా మారిందని తెలియజేస్తూ మేకింగ్ వీడియో కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Team #Odela2 celebrated the grand success of the teaser on sets ❤🔥
Smiles all around after the sensation response from the audience ✨
ICYM the #Odela2Teaser
▶️ https://t.co/mu13Sp1yHJ#Odela2 soon in cinemas nationwide.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020… pic.twitter.com/ClZh8BZpjb— BA Raju’s Team (@baraju_SuperHit) February 25, 2025
Dragon | డ్రాగన్ అందమైన సినిమా.. డైరెక్టర్ శంకర్ ట్వీట్‌కు ప్రదీప్ రంగనాథన్ రియాక్షన్ ఇదే
Toxic The Movie | ఒకేసారి రెండు భాషల్లో.. తొలి భారతీయ సినిమాగా యశ్ టాక్సిక్ అరుదైన ఫీట్..!