టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannah bhatia) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer). తొలి మహిళా బౌన్సర్ (First Female Bouncer) జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. మాధుర్ బండార్కర్ (Madhur Bhandarkar) దర్శకత్వం వహించాడు.
‘ఫతేఫూర్ బేరి..ఈ ఊరు బౌన్సర్లకు కేరాఫ్ అడ్రస్..ఈ ఊళ్లో ఏ పిల్లోడైనా పెద్దయ్యాక సెటిలవ్వాలంటే బాడీ పెంచాల్సిందే..అదీ ఓ పహిల్వాన్ లాంటి బాడీ. ఈ కథ కూడా అలాంటి ఒక పహిల్వాన్ గురించే..కానీ ఆ పహిల్వాన్ అబ్బాయి కాదు..చాకులాంటి అమ్మాయి..ఆమెనే బబ్లీ బౌన్సర్’ అంటూ సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఫన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్, సహిల్ వైద్ కీ రోల్స్ పోషించారు. సెప్టెంబర్ 23న డిస్నీ + హాట్ స్టార్‌లో ప్రీమియర్ కానుంది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పక్కా మాస్ లుక్‌లో కనిపించిన తమన్నా మళ్లీ చాలా కాలం తర్వాత బబ్లీ బౌన్సర్‌గా అదరగొట్టబోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
Read Also : Bigg Boss 6 First Task Promo | ఫస్ట్ టాస్క్..కొబ్బరి బోండాల యుద్దంలో ఎవరు గెలిచారు..ప్రోమో
Read Also : Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?