Odela 2 | టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తోన్న ప్రాజెక్ట్ ఓదెల 2 (Odela 2). అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే ఓం నమ: శివాయ.. అంటూ తమన్నా శివశక్తి లుక్ షేర్ చేశారని తెలిసిందే. ఇందులో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించనుందని క్లారిటీ ఇచ్చేశారు.
షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ను షేర్ చేశారు మేకర్స్. తమన్నా మిగిలిన పోర్షన్‌ను పూర్తి చేసే పనిలో పడింది. ఓదెల 2 షూట్లో జాయిన్ అయింది. లొకేషన్లో మేకప్ వేసుకుంటున్న స్టిల్‌తోపాటు శివశక్తిగా మారిన లుక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓదెల 2 త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఓదెల 2 చిత్రంలో వశిష్ఠ ఎన్ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్‌పై తెరకెక్కిస్తున్నారు. కాంతార చిత్రానికి గూస్బంప్స్ తెప్పించే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చిన అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఓదెల 2 కోసం తమన్నా శివశక్తి రూపంలోకి ఎలా మారిందని తెలియజేస్తూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ.. సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
.@tamannaahspeaks is back to the sets of #Odela2 #Odela2 In cinemas soon pic.twitter.com/FbYXUy6iii
— BA Raju’s Team (@baraju_SuperHit) October 8, 2024
Read Also :
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
Akkineni Nagarjuna | రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ కామెంట్స్ : నాగార్జున
ఓదెల 2 శివశక్తి మేకింగ్ వీడియో..
శివశక్తిగా తమన్నా.. మహాశివరాత్రి స్పెషల్ లుక్..
Introducing the sparkling @tamannaahspeaks in a never seen before avatar as ‘Shiva Shakthi’ from #Odela2 – a fierce devotee of the Mahadev & a virtuous saviour of Odela ✨
Wishing you all a very Happy Maha Shivaratri. Om Namah Shivaya 🔱@IamSampathNandi @ashokalle2020… pic.twitter.com/tXFtpYTkBQ
— BA Raju’s Team (@baraju_SuperHit) March 8, 2024