Tamannaah | మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టి పడేసింది. ‘హ్యపీడేస్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముంబై భామ .. అతి తక్కువ సమయంలోనే స్టార్ నటిగా ఎదిగింది. దక్షిణాది దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా క్రేజ్ ఏర్పరుచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా మారింది.
తమన్నా ఓ ఫుడీ. కొత్త కొత్త ఫుడ్స్‌ను టేస్ట్ చేస్తూ ఉంటుంది. ఏ ప్రదేశానికి వెళ్లినా.. అక్కడున్న ఫేమస్ డిష్‌ను కచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. టేస్ట్ చేయడమే కాదు.. రుచికరమైన అప్డేట్లను కూడా తరచూ ఇన్‌స్టా వేదికగా పంచుకుంటుంటుంది. తాజాగా లక్నో (Lucknow) ఫేమస్ డిష్ గురించి షేర్ చేసుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఈ డిష్‌ను టేస్ట్ చేయకుండా లక్నో నగరాన్ని విడిచి వెళ్లలేనని పేర్కొంది. ఇంతకీ తమన్నాకు ఇష్టమైన ఆ టేస్టీ ఫుడ్ ఏంటో ఊహించారా..? అదే మలై మఖన్ (malai makhan). దీన్ని నిమిష్, మలైయో అని కూడా పిలుస్తారు. ఇది ఓ స్వీట్ (Sweet Dish). శీతాకాలంలో దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ డిష్ లక్నోతో పాటు కాన్పూర్, వారణాసిలో కూడా ప్రసిద్ధి.
Tamanna
Also Read..
Nagarjuna | నాగచైతన్య – శోభిత పెళ్లి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నాగార్జున