UnstoppableWithNBK | టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK). సీజన్ సీజన్‌కు ఎంటర్టైన్ మెంట్ డోస్ పెంచేస్తూ సెలబ్రిటీలతో సందడి చేస్తున్నాడు బాలయ్య.
పాన్ ఇండియా స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేలో బాలకృష్ణతో సందడి చేశాడు. సీజన్ 4 ఎపిసోడ్ 5లో వన్ ఆఫ్ ది గెస్ట్‌గా , కుమారుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హతో కలిసి హాజరయ్యాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతోంది.
ఈ షోలో అ్లలు అర్హను తెలుగు వచ్చా అమ్మ అని అడిగితే..దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. తెలుగు రావటమా.. అని పద్యం పాడని తన కూతురు చెవిలో చెప్తాడు. దీనికి మను చరిత్రలోని అల్లసాని పెద్దన రచించిన ‘అటజని కాంచె’ పద్యం చెప్పిన వీడియో ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది.
తాజాగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అల్లు అయాన్, అర్హ, అల్లు అర్జున్ సరదా చిట్‌చాట్, ఆటపాటాకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
Wildfire episode with cutest conversations is out now 😍😍
Watch #UnstoppableS4 episode 5 now on #aha▶️ https://t.co/VElkKxgMo8#Unstoppable #iconstar #AlluArjun𓃵 #AlluArjunOnAha #stylishstaralluarjun #UnstoppableS4 #UnstoppableWithNBK #balayyapanduga #NandamuriBalakrishna… pic.twitter.com/spfpt8cgVK
— Ramesh Bala (@rameshlaus) November 22, 2024
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు