Nagarjuna | నాగచైతన్య – శోభిత పెళ్లి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నాగార్జున
Nagarjuna | టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ వేడుక గురించి నాగార్జున (Nagarjuna) ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. పెళ్లి చాలా సింపుల్‌గా చేస్తున్నట్లు వెల్లడించారు.
Nagarjuna | టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) వేదికగా వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ వేడుక గురించి నాగార్జున (Nagarjuna) ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. పెళ్లి చాలా సింపుల్‌గా చేస్తున్నట్లు వెల్లడించారు.
నాగచైతన్య – శోభిత పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదని.. తమ కుటుంబ వారసత్వంలో ఒక భాగమన్నారు. ఈ స్టూడియోస్ తన నాన్నగారికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అని చెప్పారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్లు నాగార్జున పేర్కొన్నారు. చై కోరిక మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. స్టూడియోలో ఏర్పాటు చేసిన అందమైన సెట్లో చై-శోభిత ఒక్కటి కాబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లి పనులు కూడా వారిద్దరే దగ్గరుండి చూసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. సంప్రదాయ తెలుగు పద్ధతిలో పెళ్లి చేస్తున్నట్లు వివరించారు. పెళ్లి తర్వాత రిసెప్షన్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నాగార్జున స్పష్టం చేశారు.
Also Read..
Bagheera | ఓటీటీలోకి కేజీఎఫ్ డైరెక్టర్ బఘీరా.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

