Ananth Ambani Wedding | రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌తో కలిసి అనంత్ శుక్రవారం ఏడడుగులు వేశాడు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి వేడుకపై అంబానీలు నాకు ఎవరో తెలిదంటూ బాలీవుడ్ నటి తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తాప్సీని రిపోర్టర్ అంబానీ పెళ్లికి వెళ్లలేదా అని అడుగగా.. షాకింగ్ సమాధానం ఇచ్చింది. తాప్సీ మాట్లాడుతూ.. నేను పెళ్లికి వెళ్లకపోవడానికి గల కారణం వారేవరె నాకు తెలియదు. పెళ్లి అనేది ఇరు కుటుంబాల మధ్య ఎమోషన్స్, అనుబంధాలతో కూడుకున్నది. అది పెళ్లి చేసేవారికి.. ఆ వేడుకకు వచ్చేవారికి మధ్య ఏదో ఒక అనుబంధం ఉండాలి. కనీసం పరిచయం అయిన ఉండాలి. అప్పుడే మనకు ఏ ఈవెంట్‌కు అయిన వెళ్లాలి అనిపిస్తది. నాకు అంబానీ ఫ్యామిలీతో వ్యక్తిగత పరిచయాలు కానీ.. బిజినెస్ పరిచయాలు కానీ లేవు. తెలియాని వారి పెళ్లికి నేను వెళ్లను అంటూ ఈ అమ్మడు చెప్పుకోచ్చింది.
Also Read..
Panjagutta PVR | ‘కల్కి’ సినిమా చూస్తుండగా పంజాగుట్ట పీవీఆర్‌లో వర్షం.. వీడియో వైరల్