Rakul Preeth Singh | బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక గ్యాంగ్‌ను తనిఖీ చేశారు. ఈ గ్యాంగ్ దగ్గర రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ లభ్యం అయినట్లు తెలిసింది. ఇక ఈ కొకైన్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసులో నిందితులైన అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో ఐదుగురు నైజీరియన్లు ఉండగా.. మరో వ్యక్తి అమన్ ప్రీత్ సింగ్ అని సమాచారం. అమన్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు సోదరుడు. దీంతో ఈ కేసులో ఇంకా ఎవరు ఉన్నారు అనేది బయటకు రావాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళు ఎంతో మంది విఐపి లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..