Bharateeyudu 2 Movie | ‘భారతీయుడు -2’ కలెక్షన్స్‌కు అదే మైనస్‌గా మారింది
Bharateeyudu 2 Movie | విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా,సిద్ధార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ,శంకర్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం భారతీయుడు-2.
Bharateeyudu 2 Movie | విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా,సిద్ధార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ,శంకర్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం భారతీయుడు-2.
దాదాపు 28 సంవత్సరాల క్రితం శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు సినిమా ఎంతటి ఘన విజయం సాధించందో తెలిసిన విషయమే. దానికి సీక్వెల్ భారతీయుడు 2.ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడం మొదటి భాగమైన భారతీయుడికి ధీటుగా లేకపోవడం వలన మూవీపై చాలా దెబ్బ పడింది. ఇక ఎన్నో అంచనాలతో చిత్రాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు అడుగడుగున అసంతృప్తికి గురిచేసిందని సినిమా రివ్యూలు చెబుతున్నాయి. దీనికి తోడు టిక్కెట్ల రేట్లు పెంచడం ఈ చిత్రానికి మైనస్ అనే చెప్పుకోవాలి.
తెలంగాణలో టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంను అనుమతి కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మల్టిప్లె క్స్లలో 75 నుంచి 150 వరకు టిక్కెట్ల రేటు పెంచడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ చిత్రానికి ఉన్న వీక్ టాక్ తో ప్రారంభ వసూళ్లు కూడా లేకపోవడం గమనార్హం .
ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ సినిమాకు కూడా టిక్కెట్ల రేట్ల పెంపుదల కాస్త మైనస్ గానే మారిందని అందరి అభిప్రాయం. భారతీయుడు-2 కూడా టిక్కెట్ల రేట్లు పెంచడం, సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిన విధానం వీటి ప్రభావం కలెక్షన్స్ పై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో భారతీయుడు -2 కలెక్షన్స్ కష్టమే అంటున్నారు.
Also Read..
- Balineni Srinivas Reddy | అవినీతి చేసినట్లు నిరూపిస్తే ఉరేసుకుంటా.. పవన్ కల్యాణ్‌కు బాలినేని సవాలు
- Pakistani Designers: అనంత్ అంబానీ పెళ్లి.. పాకిస్థానీ డిజైనర్ల డ్రెస్సుల్లో మెరిసిన ఇండియన్ సెలబ్రిటీలు
- Thangalaan Movie | ‘తంగలాన్’లో విక్రమ్ సాహస విన్యాసాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

