Balineni Srinivas Reddy | అవినీతి చేసినట్లు నిరూపిస్తే ఉరేసుకుంటా.. పవన్ కల్యాణ్‌కు బాలినేని సవాలు
Balineni Srinivas Reddy | వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మారుస్తారనే కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అప్పగిస్తారని తెలియడంతో.. తాను పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
Balineni Srinivas Reddy | వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మారుస్తారనే కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అప్పగిస్తారని తెలియడంతో.. తాను పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను జనసేనలో చేరుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నేను పార్టీ ఎందుకు మారతానంటూ ప్రశ్నించారు.
ఒంగోలును విడిచిపెట్టే ప్రసక్తే లేదని.. ఇక్కడే ఉంటానని బాలినేని తెలిపారు. వేరే జిల్లా నేతను అధ్యక్షుడిగా ఎందుకు నియమించడం? ఈ జిల్లాలో నాయకులు లేరా? అని పార్టీ అధినేత జగన్‌ను ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో నాయకులకు కొదవ లేదని తెలిపారు. అధ్యక్ష పదవిని జిల్లాకు సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తనను హవాలా మంత్రిగా కూటమి నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై కావాలంటే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా విచారణ జరిపించుకోవచ్చని సవాలు విసిరారు. తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే ఉరేసుకుంటానని స్పష్టంచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

