Thangalaan Movie | ‘తంగలాన్’లో విక్రమ్ సాహస విన్యాసాలు
Thangalaan Movie | కథానాయకుడు చియాన్ విక్రమ్ ఎంపిక చేసుకునే పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. విక్రమ్ నటించిన శివపుత్రుడు, ఐ, అపరిచితుడు సినిమాల ద్వారా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Thangalaan Movie | కథానాయకుడు చియాన్ విక్రమ్ ఎంపిక చేసుకునే పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. విక్రమ్ నటించిన శివపుత్రుడు, ఐ, అపరిచితుడు సినిమాల ద్వారా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తంగలాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కాలా, కబాలి వంటి సినిమాలు రూపొందించిన దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తంగలాన్. ఈ చిత్రాన్ని పా.రంజిత్ తనదైన శైలిలో అందరూ అబ్బుర పడేలా చిత్రీకరించారని యూనిట్ వర్గాలు చెప్పారు. ఇక విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే తప్పకుండా ఈ చిత్రాన్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలా అనిపిస్తుందని అంటున్నారు విక్రమ్ అభిమానులు.
తంగలాన్ బంగారు నిధుల నేపథ్యంలో యథార్థ సంఘటనలతో తీసిన చిత్రంలా కనిసిస్తుంది. విజువల్స్ ఆకట్టుకునే విధంగా వున్నాయి. మేకింగ్‌లో రిచ్‌నెస్, ప్రొడక్షన్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. విక్రమ్ ఈ చిత్రంలో అటవి జాతికి చెందిన వీరుడిలాగా… ఇప్పటి వరకు కెరీర్లో పోషించనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, కొన్నివారాల పాటు విక్రమ్ ఉపవాసాలు వున్నాడని తెలిసింది. ఈ పాత్ర కోసం విక్రమ్ చాలా హార్డ్ వర్క్ చేశారని తెలుస్తుంది. ఆయన చాలా బరువు తగ్గారు.
ఇక ఈ ట్రైలర్ లో ఆ అటవీ ప్రాంతంలో బంగారు నిధులు ఉన్నాయని బ్రిటీషర్లు గుర్తించి అక్కడి గిరిజన తెగ ప్రజలను సహాయం కోరుతారు. ఈ క్రమంలో నిధుల తవ్వకం మొదలు పెడుతారు. అప్పుడు అక్కడి ప్రజలు ఎదురుకునే ప్రమాదాల నుండి ప్రాణాలకు తెగించి కాపాడే పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. తమ జాతి ప్రజలను కాపాడుకునే వీరుడిగా విక్రమ్ నటన మరో లెవల్లో వుంటుందని అంటున్నాయి చిత్ర వర్గాలు.. మాళవిక మోహనన్,పార్వతీలు డీ గ్లామర్ రోల్ లో నటిస్తున్నారు. తంగలాన్ ఆగష్టు 15 న విడుదల కానున్నట్లు సమాచారం.
Also Read..
- Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
- Nirmal | రోడ్లపై నాట్లు వేసి గ్రామస్తుల నిరసన.. నిర్మల్ జిల్లాలో ఘటన
- IMD | తెలంగాణలో భారీ వర్షాలు : ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

