Mr Bachchan |మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) – హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). షూటింగ్ దశలో ఉంది. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదల చేసిన సితార్ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. బ్యూటీఫుల్ లిరిక్స్‌తో మ్యూజిక్ లవర్స్ మనసు దోచేస్తుంది. తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ అందించారు మేకర్స్.
ప్రస్తుతం భాగ్య శ్రీ బోర్సే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జెట్‌స్పీడ్‌లో కొనసాగుతున్నాయి. భాగ్య శ్రీ బోర్సే తన డబ్బింగ్ పూర్తి చేసే పనిలో ఉందని తెలియజేశారు మేకర్స్. త్వరలోనే మిస్టర్ బచ్చన్ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనుంది మాస్ మహారాజా టీం. ఈ చిత్రంలో జగపతి బాబు విలన్‌గా కనిపించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే లాంఛ్ చేసిన మిస్టర్ బచ్చన్ టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇందులో రవితేజ కథానుగుణంగా అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపిస్తాడని ఇన్సైడ్ టాక్. ఈ మూవీకి ఆయనంక బోస్ కెమెరామెన్ కాగా.. ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, సమర్పణ: పనోరమా స్టూడియోస్, టీ-సిరీస్, రచన-దర్శకత్వం: హరీశ్ శంకర్.

Maharaja | ప్లాట్‌ఫాం ఏదైనా రెస్పాన్స్ ఒక్కటే.. విజయ్ సేతుపతి మహారాజ ట్రెండింగ్
Darling | ప్రియదర్శి డార్లింగ్‌కు సపోర్ట్‌గా స్టార్ హీరో.. మేకర్స్ నుంచి క్రేజీ వార్త