Maharaja |కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంపౌండ్ నుంచి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా మహారాజ (Maharaja). Kurangu Bommai ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా.. తెలుగులో మిక్స్డ్ టాక్ రాబట్టుకుంది.
28 రోజుల థియాట్రికల్ రన్ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి జులై 12న డిజిటల్ డెబ్యూ ఇచ్చింది మహారాజ. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజ సేమ్ ఫీవర్‌ను కొనసాగిస్తోంది. ఈ వారం అన్ని వెర్షన్లలో రికార్డ్స్ సృష్టిస్తూ ఇండియాలో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. మహారాజ నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతుండగా.. మూవీ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
కేకే నగర్లో సెలూనే షాప్ నిర్వహించే వ్యక్తిగా కనిపించే విజయ్‌సేతుపతి.. తన ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చానని పోలీసులతో అంటాడు. లక్ష్మి అంటే నగలా, డబ్బా, డాక్యుమెంట్స్ అంటే అవేవి కాదంటున్నాడు. నీ కూతురు కాదు.. భార్య కాదు.. అక్కాచెల్లెలు కాదంటున్నారు. ఇంతకీ లక్ష్మి అంటే ఎవరో సస్పెన్స్‌లో పెడుతూ సాగుతున్న సినిమా అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.
ఈ చిత్రాన్ని ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టీ కీలక పాత్రల్లో నటించారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
#Maharaja #VJS50#netflix @VijaySethuOffl @NetflixIndia @Netflix_INSouth pic.twitter.com/dF5nhmoZMV
— Nithilan Saminathan (@Dir_Nithilan) July 14, 2024
#Maharaja is now streaming on @Netflixindia ♥️#MegaBlockBusterMaharaja pic.twitter.com/3g0zHx63m2
— RamKumarr (@ramk8060) July 12, 2024
Urvashi Rautela | క్రేజీ టాక్.. రవితేజతో ఊర్వశి రౌటేలా రొమాన్స్.. !
Kannappa | మంచు విష్ణు కన్నప్పలో శరత్ కుమార్ పాత్ర ఇదే.. లుక్ వైరల్
Sarfira | అక్షయ్‌కుమార్-సూర్య సర్ఫిరా వసూళ్లు ఎంతంటే..?
Bhahishkarana | అంజలి ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలో..? హాట్ టాపిక్‌గా బహిష్కరణ