Panjagutta PVR | అదివారం హైదరాబాద్‌లో వాన దంచికొట్టిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో ఆదివారం గ్రేటర్‌లోని పలు చోట్ల వర్షం దంచి కొట్టింది. మారేడ్‌పల్లిలోని న్యూ మెట్టుగూడలో రాత్రి 9గంటల వరకు అత్యధికంగా 7.75 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. అయితే పంజాగుట్టలో ఉన్న పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో ‘కల్కి’ సినిమా చూస్తుండగా ప్రేక్షకుల మీదా వర్షం పడింది.
ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారిగా ముంచుకొచ్చిన వాన హైదరాబాద్‌ను ముంచెత్తింది. ఈ క్రమంలోనే వీకెండ్ కదా సినిమాకు వెళుదామని పంజాగుట్ట సెంట్రల్ మాల్లోని పీవీఆర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. ప్రేక్షకుల కల్కి మూవీ చూస్తుండగా.. పీవీఆర్ రూఫ్(సీలింగ్) పైన నుంచి వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ప్రేక్షకులు సినిమా థియేటర్లో వర్షం ఏంటి అని ఆందోళన చెందారు. దీనిపై స్పందిస్తూ.. వర్షం పడి షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా అవాంఛనీయ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులంటూ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యజమానులతో వాగ్వాదానికి దిగారు.
Due to the heavy rain in #Panjagutta #Hyderabad , there is rain water in the #PVR cinema theater. The audience who came to watch the movie got into a fight with the theater owners as to who will be responsible if there is a short circuit and any untoward accident. #PVR#Rains pic.twitter.com/9uqNodQIUf
— SHRA.1 JOURNALIST✍ (@shravanreporter) July 14, 2024
Also Read..