Siva Karthikeyan | కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్(Shiva karthikeyan) ఇటీవల మూడోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. తన కొడుకుకి పవన్ శివకార్తికేయన్(Pavan Shivakarthikeyan) అని నామకరణం చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. నటుడు శివ కార్తికేయన్ తన దగ్గరి బంధువైన ఆర్తి దాస్ ను 2010లో పెళ్లిచేసుకున్నాడు. ఇప్పటికే ఈ దంపతులకు ఆరాధన, గుగన్ దాస్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే చాలా కాలం తర్వాత ఈ జంట మూడో బిడ్డకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అందరూ అనుకున్నట్లుగానే గత నెల ఆర్తి దాస్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
తాజాగా ఈ బేబీకి నామకరణ(naming ceremony) వేడుకను నిర్వహించారు శివకార్తికేయన్ దంపతులు. కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకను వీడియో రూపంలో పంచుకున్న శివ కార్తికేయన్ వీడియో చివరిలో తన కొడుకుకి పవన్ కార్తికేయన్ (Pavan Shivakarthikeyan) అని పేరు పెట్టినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Aaradhana – Gugan – PAVAN ❤️❤️❤️ pic.twitter.com/T0YNorVIQb
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) July 15, 2024
Also Read..