Rain Update | నేడు ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు: ఐఎండీ
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rain) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
హైదరాబాద్: రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rain) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక తెలంగాణలో వచ్చే ఐదురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపపథ్యంలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఆవర్తనం పశ్చిమబెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని పేర్కొన్నది. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొన్నది.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా నీల్వాయిలో అత్యధికంగా 15.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. భూపాలపల్లి జిల్లా కాటారంలో 11.15, ఆదిలాబాద్‌లోని కుంచవెల్లిలో 11.08, భూపాలపల్లిలోని మహదేవ్‌పూర్‌లో 11, కొయ్యూరులో 10.65, మంచిర్యాలలోని కోటపల్లిలో 9.48, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో 9.48, వికారాబాద్‌లోని నవాబ్‌పేటలో 8.48, రాజధానిలోని షేక్‌పేటలో 8.45, మారేడ్‌పల్లిలో 8.4, ఖైరతాబాద్‌లో 8.4, ముషీరాబాద్‌లో 8.2, శేరిలింగంపల్లిలో 7.93 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Heavy Rain
- IMD
- Kamareddy
- medak
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

