Ram Chran – Buchibabu Sana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan), ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సాన (BuchiBabuSana) కలయికలో ‘ఆర్సీ 16’ అనే ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుండగా ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. యూనివర్సల్ కంటెట్‌తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చరణ్ అభిమానుల కోసం ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. దుబాయ్‌లోని ఫిర్దౌజ్ స్టూడియోస్‌లో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్టు తెలిపింది.
ప్రీ ప్రోడక్షన్ పనుల్లో పాల్గోన్న చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుంటూ ప్రీ ప్రోడక్షన్ పనుల్లో ‘నాకు ఇష్టమైన వ్యక్తులతో’ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రఫర్ రత్నవేలు లతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్లో తెగ వైరల్ అవుతుంది.
ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్లో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ సమర్పిస్తుండగా.. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై వెంకటసతీశ్ కిలారు అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Two of my favourite people 🤍🤍🤍🤗🤗🤗@arrahman Sir @RathnaveluDop Sir pic.twitter.com/qInQW9Hs60
— BuchiBabuSana (@BuchiBabuSana) July 14, 2024
Also Read..
KA Movie | తోడేలు వచ్చేసింది.. యాక్షన్ ప్యాక్డ్గా కిరణ్ అబ్బవరం ‘క’ టీజర్
Panjagutta PVR | ‘కల్కి’ సినిమా చూస్తుండగా పంజాగుట్ట పీవీఆర్‌లో వర్షం.. వీడియో వైరల్
Siva Karthikeyan | కొడుకుకి నామకరణం చేసిన శివకార్తికేయన్.. పేరు ఏంటో తెలుసా.?